ప్రజలకు విజ్ఞాన సంబంధిత అంశాల గురించి సాంకేతికంగా అవగాహనకల్పించడమే e.SciComయొక్క ప్రధాన లక్ష్యం. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది
ప్రజలకు చేరుకోవడానికి ఇది వేగవంతమైన మరియు సమర్ధవంతమైన వేదికగా పేర్కొనవచ్చు.
దీనిలో భాగంగా విస్తరణ మరియు సమాచార యాజమాన్య విభాగ శాఖకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాకారంతో వివిధ రకాల సమాచారాన్ని సమీకరంచి, సంక్షిప్త రూపంలో ప్రాంతీయ భాషయైన తెలుగులో పొందుపరచడం జరగంది.
అంతర్జాతీయ చిరుధాన్యాలు సంవత్సరం 2023 లో భాగంగా చిరుధాన్యాల యొక్క ఉపయోగాలు, పోషక విలువలను, అలాగే జీవనశైలిలో జరుగుతున్న ఆరోగ్య మార్పులకు అనుగుణంగా వస్తున్న రోగాలు మరియు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన చర్యల గురించిన సంక్షిప్త సమాచారాన్ని వివిధ దృశ్య శ్రవణ పద్ధతులలో సమస్యలు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో సాంకేతిక సమాచారాన్ని సమీకరించి సంక్షిప్త రూపంలో పొందుపరచటం జరిగింది.
ప్రస్తుత కాలంలో సమాచారం వివిధ పద్ధతులలో వివిధ వ్వక్తుల ద్వారా వివిధ మాధ్యమ రూపాలలో లభిస్తుంది. దీనితో ప్రజలు ఏ సమాచారం సరైనదో తెలియక ఆందోళన మరియు అపోహలకు గురవుతున్నారు. దీనిని గుర్తించి విద్యార్థుల ద్వారా సేకరించబడిన సమాచారాన్ని వారి సృజనాత్మకతను జోడించి సాంకేతిక నిపుణుల సహాయం ద్వారా అమోదించబడిన సమాచారాన్ని పొందుపరచడం జరిగింది.