కొర్ర రిబ్బన్ పకోడి
కావలసిన
పదార్థాలు :
కొర్ర
పిండి - 100
గ్రా.
శనగ పిండి - 10 గ్రా.
పుట్నాల
పిండి - 10 గ్రా.
వాము - 2.5 గ్రా.
కారం లేక
మిరియాల పొడి - 5 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
వెన్న లేక
వేడి నూనె - 10 మి.ల్లీ
ఇంగువ - చిటికెడు
తయారి విధానం :
- ఒక గిన్నెలో కొర్ర పిండి తీసుకొని, దానికి శనగపిండి, పుట్నాల పిండి, కారం, ఉప్పు, వాము ఇంగువ, 2 చెంచాల వేడి నూనె వేసుకొని, జంతికల పిండిలాగ కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసుకొని, జంతికల గిద్దలో పకోడి చక్రం పెట్టుకొని, పకోడి వత్తుకొని, దోరగా రెండువైపులా వేపుకుంటే కరకరలాడే కమ్మని కొర్ర రిబ్బన్ పకోడి తయారవుతుంది.